ప్రభుత్వాసుపత్రుల్లోనే మందులు ఇవ్వాలి

10 Jan, 2023 01:18 IST|Sakshi

ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాయకూడదు: మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: మందులు ఎట్టి పరిస్థితు ల్లోనూ బయటకు రాయ కూడదని, డిశ్చార్జి అయిన రోగు లకు ప్రభుత్వ ఆసు పత్రుల్లోనే మందులు ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ నుంచి అవస రమైన మందులు ఆసుపత్రు లకు సకాలంలో అందించాలన్నా రు. సోమవా రం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధి లోని ఆసు పత్రుల నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించిన 56 టిఫా స్కానింగ్‌ సేవలు గర్బిణులకు అందేలా చూడాలని సూచించారు.

సి సెక్షన్ల శాతం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కు వగా ఉందని, దాన్ని తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలన్నారు. అనవసర సి సెక్షన్ల వల్ల కలిగే నష్టాన్ని కౌన్సెలింగ్‌ ద్వారా వివరించాలన్నారు. సి సెక్షన్‌ లేదా సాధా రణ డెలివరీ చేయాలా వద్దా అనేది పూర్తిగా డాక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని తెలియజేయాలని ఆయన చెప్పారు.

డైట్, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది రోగు లు, వారి సహాయకులతో మర్యాదగా ప్రవర్తించాలని, నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేత మహంతి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు, డీఎంఈ రమేష్‌ రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు