సామాజిక అంశాల పరిష్కారానికి రాజ్యాంగమే దిక్సూచి

19 Dec, 2022 02:28 IST|Sakshi
వేదికపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్‌ సత్యార్థి 

లైంగిక బాధితులకు ఉపశమన కార్యక్రమాలు చేపట్టాలి: హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

ప్రత్యేక కోర్టులు విస్తరించాలి: కైలాశ్‌ సత్యార్థి

వరంగల్‌ లీగల్‌: దేశ ఆర్థిక, సామాజిక అంశాల పరిష్కారానికి రాజ్యాంగమే దిక్సూచిగా నిలుస్తోందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన జ్యూడీషియరీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలలపై జరుగుతున్న లైంగిక హింస కేసుల్లో బాధితులకు ఆర్థిక, శారీరక ఉపశమన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

బాధితులను భవిష్యత్‌ పౌరులుగా సమాజంలో భాగస్వాములను చేసే దిశగా బాలల హక్కుల పరి రక్షణ కోసం పని చేసే అన్ని వర్గాలు దృష్టి సారించా లని పిలుపు నిచ్చారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్ర హీత కైలాశ్‌ సత్యార్థి మాట్లాడుతూ చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులు, బంధువులు, పరిచ య స్తుల ద్వారానే అత్యధిక శాతం జరుగుతున్నా య న్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు విస్తరించడం ద్వా రా బాధితులకు సత్వర న్యాయం అందించగలు గుతామని చెప్పారు.

వరంగల్‌ పోక్సో కోర్టు ఈ దిశ గా చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. కార్యక్ర మంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కు మార్, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె.రాధాదేవి, ఎం.కృష్ణ మూర్తి, వ రంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, రాజీ వ్‌గాంధీ హన్మంతు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం విన య్‌భాస్కర్, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆనంద్‌మోహన్, శ్రీనివాస్‌గౌడ్, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు జనార్దన్, జయాకర్, ఇతర న్యా యమూర్తులు, లాయర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు