యాదగిరిగుట్టలో భారీ వర్షం 

1 Jun, 2022 01:26 IST|Sakshi
మొదటి ఘాట్‌ రోడ్డు ఫ్లైఓవర్‌ వద్ద వర్షానికి కొట్టుకుపోయిన మట్టి  

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయమంతా భానుడు తన ప్రతాపాన్ని చూపెట్టడంతో పట్టణ ప్రజలతో పాటు యాదాద్రి క్షేత్రానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం.. ఒక్కసారిగా చల్లబడి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో సుమారు 15 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది.

దీంతో యాదాద్రి రింగ్‌రోడ్డులో ఉన్న మొక్కలు నెలకొరిగాయి. కొండపైన క్యూకాంప్లెక్స్‌లోని ఎక్సలేటర్‌ సమీపంలో స్లాబ్‌ సీలింగ్‌ పైనుంచి వర్షం నీళ్ళు లీక్‌ అవుతున్నాయి. మొదటి ఘాట్‌ రోడ్డును కలిపేందుకు ఏర్పాటు చేస్తున్న ఫ్లై ఓవర్‌ వద్ద మట్టి కొట్టుకు పోయింది. మొదటి ఘాట్‌ రోడ్డు వద్ద వాహనాలు పైకి వెళ్లే దారి సమీపంలో వర్షం నీరు నిలిచిపోవడంతో అక్కడ మరమ్మతులు చేశారు.  

మరిన్ని వార్తలు