ఆన్‌లైన్‌ క్లాసులూ నిర్వహించాలి..

4 Feb, 2022 01:37 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

వారాంతపు సంతలకంటే బార్లు, రెస్టారెంట్లతోనే ప్రమాదం

అన్నిచోట్లా కోవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చూడాలి 

సాక్షి, హైదరాబాద్‌: విద్యా సంస్థల్లో ఈ నెల 28 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలని ఆన్‌లైన్‌ బోధన కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాస నం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరో నాపై దాఖలైన పలు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను గురువారం ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

వారాంతపు సంతల కంటే బార్లు, రెస్టారెంట్ల వల్లే ఎక్కువ ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించింది. వీటి వద్దే ఎక్కువ మంది జనం ఉంటారని, ఇక్కడ కూడా కోవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవా లని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో రెండు వారా ల్లోగా నివేదించాలని కోరింది. 

అక్కడా అమలు చేయండి..: అన్ని మతపర మైన కార్యక్రమాల్లోనూ కోవిడ్‌ మార్గదర్శకాలు అమలు చేయాలని ఆదేశించింది. సమ్మక్క జాతరలో, సమతామూర్తి సహ స్రాబ్ది వేడుకల్లో కోవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చూడా లని ఏజీకి సూచిం చింది. నిర్లక్ష్యం వహిస్తే కరోనా ప్రబలే ప్రమాదం ఉంటుందని, అందుకే ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించగా.. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌తో పాటు న్యాయ వాదులు పవన్, చిక్కుడు ప్రభాకర్‌ ఇతరులు వాదించారు. విచారణకు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు హాజరయ్యారు. 

పిల్లలకు చికిత్స కోసం ఏర్పాట్లు: పిల్లలకు చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆస్ప త్రుల్లో ఏర్పాట్లు చేసినట్లు శ్రీనివాసరావు వివరిం చారు. మేడారం జాతరలో ప్రభుత్వం కోవిడ్‌ జాగ్రత్తలన్నీ తీసుకుంటుందని చెప్పారు. కరోనా తీవ్రత ఎక్కువగా లేనందునే విద్యా సంస్థలను తెరిచా మని, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యా సంవత్సరం నష్టపో కుండా చర్యలు తీసుకున్నామంటూ విద్యా శాఖ విడిగా నివేదిక అందజేసింది. కాగా ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను ఈ నెల 28న జరిగే విచారణ నాటికి అందించాలని ధర్మాసనం ఆదేశించింది. 

మరిన్ని వార్తలు