పీడీ పోస్టులకు అనుమతించండి

31 Jan, 2023 01:38 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఎడ్యుకేషన్‌ జారీ చేసిన పీడీ పోస్టుల పరీక్షకు అనుమతించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేసిన 192 మందిని పీడీ పోస్టు పరీక్ష రాసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే తాము వెల్లడించే వరకు ఫలితాలు విడుదల చేయవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది.

ఎంపీఈడీ పూర్తిచేసిన తమను ఇంటర్‌ ఎడ్యుకేషన్‌ జారీ చేసిన పీడీ పోస్టుల పరీక్ష రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చలకూర్తికి చెందిన ఆర్‌.శ్రీనుతో పాటు మరో 191 మంది పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పోస్టులకు గత నెల నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం.. ఎంపీఈడీతోపాటు పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు మాత్రమే అర్హులని పేర్కొంది.

ఇది చట్టవిరుద్ధమని.. డిగ్రీ పూర్తి చేసిన తమను పరీక్ష రాసేందుకు అనుమతించాలని, ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని అభ్యర్థులు హైకోర్టును ఆశ్ర యించారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకా రాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మా సనం.. పరీక్ష రాసేందుకు పిటిషనర్లకు అను మతి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు