‘డాటా మిస్‌యూజైతే ఆ బాధ్యత ఎవరిది?’

25 Nov, 2020 18:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌పై బుధవారం హై కోర్టులో విచారణ జరిగింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపైన విధించిన స్టేని డిసెంబరు 3 వరకు పొడగిస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు వీలుగా స్టే ఎత్తివేయాలంటూ అడ్వొకేట్ జనరల్ చేసిన అభ్యర్థనని కోర్టు తోసిపుచ్చింది. ఇక విచారణ సందర్భంగా ధరణి పోర్టల్‌లో డాటాని మిస్‌ యూస్‌ చేస్తే ఎవరు బాధత్య తీసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గతంలో ఆధార్‌ కార్డు సమాచారం రెండు సార్లు లీకయ్యింది.. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని తెలిపింది. ఆధార్‌ కార్డు వివరాలు కావాల్సి వస్తే.. ప్రభుత్వం, ఆధార్‌ కార్డు డివిజన్‌ అనుమతి తప్పనిసరి అని పిటీషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆధార్‌ సమాచారాన్ని షేర్‌ చేయాలంటే జ్యూడిషియల్‌ పర్మిషన్‌ కావాలని పిటీషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

అంతేకాక ధరణి పోర్టల్‌లోని డాటాని ఎక్కడ.. ఎలా స్టోర్‌ చేస్తారు.. ఆ డాటా ఎవరికి కావాలి.. ఎందుకు అవసరం.. ఏ పద్దతిలో స్టోర్‌ చేస్తారో తదితర వివరాలు తెలపాలని పిటీషనర్‌ తరపు న్యాయవాది కోరారు. ఇంట్లో ఉన్న వారి వ్యక్తిగత వివరాలు ఎందుకు అని పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఆర్టికల్ 300ఏ ప్రకారం ఆస్తుల వివరాలు ధరణిలో నమోదు  చేసుకోకపోతే.. వాటిని బదిలీ చేయడం, అమ్మడం వంటి కార్యక్రమాలను నిషేధించడం చట్ట విరుద్ధం అన్నారు. వ్యవసాయేతర ఆస్తులకి పాస్ బుక్ ఇవ్వడం ఏ చట్టంలో కూడా  లేదని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. నా ఆస్తిని  నేనమ్ముకోవాలంటే  నా వ్యక్తిగత  వివరాలు ఇవ్వాలని ఏ చట్టంలో లేదన్నారు. (ధరణి: కులం వివరాలు అడగడం లేదు)

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. ఇప్పటికే రూరల్  ఏరియాలో  97శాతం ఆస్తుల వివరాలు.. మున్సిపాలిటీల్లో 87శాతం ఆస్తుల వివరాల నమోదు పూర్తి అయిందని ఏజీ కోర్టుకు తెలిపారు. అయతే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో ఈ విషయం ప్రస్తావించలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 16.60 లక్షల మంది ఉంటే అందులో 2.90 లక్షల మంది ఆస్తుల నమోదు చేసుకున్నారని 30,000 వ్యవసాయ ఆస్తుల ట్రాన్స్‌యాక్షన్స్‌ జరిగాయని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇక పేపర్‌లో గతంలో  ధరణిలో రిజిస్ట్రేషన్  చేసుకపోతే  దాని  పరిణామం ప్రజలే భరించాలంటూ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై అనుమానాన్ని క్లియర్‌ చేసే బాధ్యత కోర్టు మీదనే ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా