ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారణ

27 Jul, 2021 14:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వ  వివాదంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఇప్పటికే చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయగా, కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై చెన్నమనేని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కౌంటర్ పిటిషన్లపై ఇరుపక్షాలు తమ వాదనలను హైకోర్టుకు వినిపించారు.

ఎన్నికల్లో పాల్గొనడానికి పూర్తి అర్హత ఉందని చెన్నమనేని తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పటికీ చెన్నమనేని జర్మనీలో ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. భారత ప్రభుత్వానికి ఓసిఐ కార్డు కోసం అప్లయ్‌ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. హోంశాఖ కూడా చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు తెలిపిందని న్యాయవాది వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు