Farm House Issue: మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఘటనపై హైకోర్టులో విచారణ

7 Nov, 2022 16:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్(ఏఏజీ)‌. పిటిషనర్‌కు ఎమ్మెల్యేల కొనుగోలుతో ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. ఇలాంటి అంశాలపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను కోర్టు ముందు ప్రస్తావించారు ఏఏజీ. 

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేశారని, బీజేపీలో చేరకపోతే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తామని బెదిరించారని తెలిపారు ఏఏజీ. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న వాదనలను తోసిపుచ్చారు. కేసు విచారణ ప్రారంభ దశలోనే ఉందని, ఇప్పుడు సీబీఐకి ఇవ్వడం సారికాదన్నారు. 

మరోవైపు.. బీజేపీ తరపున కర్ణాటక మాజీ ఏజీ వాదనలు వినిపించారు. ఇదంతా టీఆర్‌ఎస్‌ పక్కా ప్లాన్‌తో చేసిందని ఆరోపించారు బీజేపీ న్యాయవాది. పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోందన‍్నారు. సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటపడతాయని కోరారు.

ఇదీ చదవండి: సెంటిమెంట్లకు చోటు లేదు.. గ్యాంగ్‌ రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసులో నిర్దోషులుగా ఉరిశిక్ష ఖైదీలు

మరిన్ని వార్తలు