కేంద్ర హోం కార్యదర్శికి హైకోర్టు నోటీసులు 

9 Jun, 2022 04:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోర్టు ధిక్కార కేసులో కేంద్ర హోం శాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ట్విట్టర్‌లో ‘ఇస్లామిక్‌ కరోనా వైరస్‌ జిహాద్, కరోనా జిహాద్, తబ్లిగ్‌జామాత్, ఇస్లామోఫోబిక్‌’లాంటి పేర్లతో చేస్తున్న అసభ్య పోస్టులను వెంటనే ఆపా లని 2020లో హైకోర్టు పిటిషన్‌ దాఖలైంది. ఒక వర్గాన్ని కించపరుస్తూ పెట్టే మెసేజ్‌ల ను ఆపాలని, ట్విట్టర్‌ సీఈవోతోపాటు సదరు పోస్టులు పెట్టిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకునేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలని పిటిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పోస్టులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని 2021లో హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఇప్పటివరకు ఉద్దేశపూర్వకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని 2022లో పిటిషనర్‌ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు