యాదాద్రి నిజాభిషేకంలో హైకోర్టు న్యాయమూర్తి

8 Aug, 2022 00:56 IST|Sakshi
జస్టిస్‌ సూరేపల్లి నందాకు లడ్డూ ప్రసాదం  అందజేస్తున్న ఆలయ అధికారి విజయ్‌కుమార్‌ 

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నందా ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసాన్ని పుర స్కరించుకుని ఆదివారం వేకువజామునే ఆలయంలో స్వయంభూ మూర్తులకు నిర్వహించిన నిజాభి షేకంలో పాల్గొన్నారు.

అనంతరం గర్భాలయంలోని పంచనారసింహులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్‌ నందాకు అద్దాల మండపం వద్ద ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.

మరిన్ని వార్తలు