పిల్లలకంటే కులమే ఎక్కువైంది.. ‘కుల, మతాంతర వివాహాలు చేసుకుంటే... బతికే హక్కు లేదా?’

4 Jun, 2022 15:43 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధారాణి 

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధారాణి ఆవేదన

కుల, మతాంతర వివాహాలు చేసుకున్న వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే

సుందరయ్యవిజ్ఞానకేంద్రం: కుల, మతాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ లేకుండా పోయిందని, తల్లిదండ్రులే పిల్లలను చంపేస్తున్నారని, వారికి పిల్లల కంటే కులమే ఎక్కువైందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో మహిళా, ట్రాన్స్‌జెండర్‌ సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ‘కుల, మతాంతర వివా హాలు–హత్యా రాజకీయాలు’ అనే అంశంపై శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరి గింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జస్టిస్‌ రాధారాణి మాట్లాడుతూ.. సమాజంలో రోజు రోజుకు కులతత్వం పెరిగి పోతోందన్నారు. కుల, మతాంతర వివాహా లు చేసుకున్న వారిని హత్య చేస్తున్న నింది తులను చట్టప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వరిత గతిన శిక్ష పడాలని అందరు కోరుకుంటు న్నప్పటికీ అందుకు సరిపడా న్యాయమూ ర్తులు లేరని ఆమె చెప్పారు.

ప్రజల ప్రాథ«మిక హక్కులను కాపాడాల్సిన, ప్రేమ వివాహం చేసుకున్న వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్య త ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితురాలు అవంతిక మాట్లాడుతూ ‘కుల, మతాంతర వివాహాలు చేసుకుంటే... బతికే హక్కు లేదా?’ అని ప్రశ్నించారు. ఆరు నెలలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నా ఇంత వరకు శిక్ష పడలేదని, ముందుగా న్యాయ వ్యవస్థలో మార్పు రావాలని ఆమె అన్నారు. పీవోడ బ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి.సంధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు‡ రమా మెల్కొటే, పద్మజాషా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు