Telangana: రాహుల్‌ టూర్‌ అనుమతిపై నిర్ణయం వీసీదే: హైకోర్టు

2 May, 2022 17:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓయూ పర్యటనపై దాఖలైన హౌజ్‌ మోషన్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. రాహుల్‌ టూర్‌ అనుమతిపై నిర్ణయాన్ని వీసీకే హైకోర్టు వదిలేసింది. దరఖాస్తును పరిశీలించాలని వీసీకి హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది.
చదవండి👉: రాహుల్‌ రాకపై కాక! 

కాగా, రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన వ్యవహారం మరింత ముదురుతోంది. రాజకీయాలకు అతీతంగా రాహుల్‌ ఓయూకి వస్తారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్‌ ఓయూ వీసీని కలిసి అనుమతి కోరినా.. రాజకీయ సభలకు అనుమతి లేదంటూ తిరస్కరించడంతో కాంగ్రెస్‌ అనుబంధ విభాగాలు ఆందోళనకు దిగాయి. ఓయూ విద్యార్థి నేతలు ఆదివారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడికి యత్నించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ) చాంబర్‌ ముందు చీరలు, గాజులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. ఈ విద్యార్థి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం, వారిని పరామర్శించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు