TS High Court: కమిటీ వేస్తే ఇబ్బంది ఏంటి?

17 Jun, 2021 12:53 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలోని దేవరయాంజల్ భూముల వ్యవహారంలో ఐఏఎస్‌ల కమిటీ ఏర్పాటు జీవో కొట్టేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.  ఈ మేరకు ఆలయ భూములు గుర్తించేందుకు కమిటీ వేస్తే ఇబ్బంది ఏంటని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వడం కమిటీ బాధ్యతని హైకోర్టు పేర్కొంది.

నోటీసులు ఇవ్వకుండా భూముల్లోకి వస్తున్నారని పిటిషనర్‌ వాదనపై కోర్టు స్పందించింది. భూముల్లోకి వెళ్లే ముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు విచారణకు సహకరించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయాలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

చదవండి: ట్విటర్‌కు హైదరాబాద్‌ పోలీసుల నోటీసులు

మరిన్ని వార్తలు