TS: గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు

9 Sep, 2021 11:25 IST|Sakshi

గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

సాక్షి, హైదరాబాద్‌: గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై ఆంక్షలు అమలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి గురువారం ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. 

ప్రత్యేక కుంట్లలో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలను నిమజ్జనం చేయాలని హైకోర్టు సూచించింది. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్‌ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని హైకోర్టు పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని ధర్మాసనం పేర్కొంది.
(చదవండి: డైరీలో.. మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నా, నా కోసం..)

మరిన్ని వార్తలు