మ‌ర‌ణాల రేటు త‌క్కువ చేసి చూపిస్తున్నార‌న్న కోర్టు

12 Oct, 2020 15:33 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై హైకోర్టు మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో  సుదీర్ఘ విచారణ సంద‌ర్భంగా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గ‌తంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారంటూ  హైకోర్టు అభిప్రాయ‌పడింది. అయితే విచారణకు హాజరైన వైద్యశాఖ అధికారులు రాష్ర్టంలో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని కోర్టుకు తెలిపారు. దీనికి అభ్యంత‌రం చెబుతూ ఎక్కువ టెస్టులు చేయ‌న‌ప్పుడు కరోనా కేసులు ఎలా తెలుస్తాయంటూ హైకోర్టు ప్ర‌శ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వ టెస్ట్ ల్యాబ్స్ తక్కువగా ఉన్నాయని పేర్కొంది. తప్పుడు లెక్కలతో హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్య‌క్తం చేసింది. 

మరిన్ని వార్తలు