సీబీఐకి ఇవ్వాలా? వద్దా? 

4 Feb, 2023 01:52 IST|Sakshi

ఎమ్మెల్యేలకు ఎర కేసులో అప్పీళ్లపై తీర్పు 6న  

గత నెల 18న రిజర్వు చేసిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం  

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో అప్పీళ్లపై తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సోమవా రం వెల్లడించనుంది. జన వరి 4న అప్పీళ్లు దాఖలు కాగా, అదే నెల 18 వరకు వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. సిట్‌ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సిట్‌ అప్పీల్‌ పిటిషన్లు దాఖలు చేసింది. బీజేపీతోపాటు నిందితులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌లో సీఎం కేసీఆర్‌ వాది, ప్రతివాదిగా లేనప్పుడు ఆయన గురించి తీర్పులో ప్రస్తావించడాన్ని అప్పీల్‌లో తప్పుపట్టాయి. ఎమ్మెల్యేల కొనుగోలు చేసి ప్రభుత్వా న్ని కూల్చాలని కుట్ర జరిగిందని, అందువల్ల నిందితులకు అనుకూలంగా వచ్చిన సింగిల్‌జడ్జి తీర్పు రద్దు చేయా లని కోరింది. అప్పీళ్లపై ప్రభు త్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే, నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు డీవీ సీతారాంమూర్తి, రవిచందర్‌ వాదనలు వినిపించారు.  

మరిన్ని వార్తలు