ఆగస్టులో ఎంసెట్‌! 

17 Jun, 2021 08:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ పరీక్షలు ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాస్తవానికి జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించాలని తేదీలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను మరికొంత కాలం వాయిదా వేయాలని భావించారు. తీవ్రత తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించే అంశంపై చర్చించి ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమా చారం. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన తర్వాత తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఈసెట్, పీజీఈసెట్‌ పరీక్షల తేదీలు కూడా మారే అవకాశముందని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు