అలర్ట్‌: హైదరాబాద్ మెట్రో కొత్త టైమింగ్స్‌ ఇవే

31 May, 2021 06:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపులు నేపథ్యంలో మెట్రో రైలు సేవల్లోనూ మార్పులు జరిగాయి. ఇక పై ప్రతీ రోజు ఉ.7గంటలకు నుంచి ఉ.11.45 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండనున్నట్లు హైదరాబాద్‌ మెట్రో యాజమాన్యం ప్రకటించింది. అదే క్రమంలో చివరి రైలు ఉ.11.45 కు మొదలై.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుతుందని పేర్కొంది. ప్రయాణికులు తప్పక మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని స్పష్టం చేసింది.

ఆర్టీసీ వేళలు పెంపు 
నగరంలో సిటీ బస్సు లు సోమవారం నుంచి మరింత అందుబాటులోకి రానున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపు సమయాన్ని ఒంటి గంట వరకు పొడిగించడంతో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్య లు చేపట్టింది. ఇకపై మధ్యాహ్నం రెండు గంటల్లోగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా బ స్సులు నడుపనున్నారు. అలాగే ఆటోలు, క్యాబ్‌లు తదితర వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటి వరకు ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు రోడ్డుపై తిరిగిన ఆర్టీసీ బస్సులు..తాజాగా మరో మూడు గంటలకుపైగా తిరుగనున్నాయి. గ్రేటర్‌లో 29 డి పోల పరిధిలో 2550 సిటీ బస్సులు పూర్తిస్థాయిలో సోమవారం నుంచి రోడ్డెక్కనున్నాయి. మరో లక్షన్నర ఆటోలు, 50 వేల క్యాబ్‌లు కూ డా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అ వకాశం ఉంది. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ లోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 1500 బస్సులకు ఊరట లభించింది.   
చదవండి: తెలంగాణలో మరో పదిరోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు