ఇక ఆయుధాలు ఇవ్వాలేమో!: కోర్టుల సంచలన తీర్పులపై స్మితా సబర్వాల్‌ ఆవేదన

9 Nov, 2022 07:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేప్‌ కేసుల్లో తాజా కోర్టు తీర్పులపై ముఖ్యమంత్రి కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ స్పందించారు ‘‘దేశంలో న్యాయపరంగా ఇలాగే నిరాశాజనక ధోరణి కొనసాగితే.. ఆయుధాలు కలిగి ఉండే హక్కును మహిళలకు కల్పించడానికి ఇది సరైన సమయం కావచ్చు’’.. అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం, చట్టం రెండూ వేర్వేరు అంశాలు కాకూడదని ఆమె ట్వీట్‌ చేశారు.

గ్యాంగ్‌ రేప్‌ కేసులో ఓ దోషికి విధించిన శిక్షను 25 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించడంతో పాటు అతడికి బెయిల్‌ మంజూరు చేస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పు, ఢిల్లీలో సంచలనం రేపిన ఓ అత్యాచారం, హత్యకేసులో దోషులకు విధించిన మరణ శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె ఈవిధంగా స్పం­దించారు.

బిల్కిస్‌ బానో అత్యాచారం కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడంపైనా ఆమె గతంలో ట్విట్టర్‌ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

మరిన్ని వార్తలు