దూసుకొచ్చిన వీఆర్‌ఏలు.. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ మరో ఫెయిల్యూర్‌

13 Sep, 2022 15:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటెలిజెన్స్‌ మరోసారి విఫలం అయింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ వీఆర్‌ఏల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. ఇంటెలిజెన్స్‌ ఛలో అసెంబ్లీని పసిగట్టలేకపోయింది. మంగళవారం ఏడు సంఘాలు ఒకేసారి అసెంబ్లీ ముట్టకి యత్నించాయి.

హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న అనేక మంది వీఆర్‌ఏలు మూడు రోజుల ముందుగానే బంధువుల ఇళ్లకి చేరుకున్నారు. మంగళవారం విడతల వారీగా 6వేల మంది వీఆర్‌ఏలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసం, కాంగ్రెస్‌ రాజ్‌భవన్‌ ముట్టడిలను కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పసిగట్టలేకపోయింది.

ఇదిలా ఉంటే, వీఆర్‌ఏల అసెంబ్లీ ముట్టడి విషయం తెలుసుకున్న ఐటీ మంత్రి కేటీఆర్‌ వారితో సమావేశమయ్యారు. వీఆర్‌ఏ సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వీఆర్‌ఏలు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్‌ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 

చదవండి: (Telangana VRAs: ప్రభుత్వంతో ముగిసిన వీఆర్‌ఏల చర్చలు)

మరిన్ని వార్తలు