తెలంగాణ: ముగిసిన తొలిరోజు ఇంటర్‌ పరీక్షలు

25 Oct, 2021 13:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. కరోనా నేపథ్యంలో గతంలో వాయిదా పడిన పరీక్షలను నేడు ప్రారంభించిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధల ప్రకారం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు 1,768 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,59,228 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించనుంది. ఎవరైనా మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 వేల 354 మంది విద్యార్దులు పరీక్షలు రాయనున్నారు.ద్రాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ టెస్టులు,శానిటైజేశన్,మాస్కులు తప్పని సరి చేశారు .పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వమని చెప్పిన నేపధ్యంలో విద్యార్దులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. చివరి నిమిషంలో కూడ కొందరు విద్యార్దులు పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

కాగా థర్మల్‌ స్క్రీనింగ్‌లో అస్వస్థతగా ఉన్నట్లు గుర్తిస్తే ఐసోలేషన్‌ గదిలో ఉంచుతారు. ఓపిక ఉంటే అక్కడైనా పరీక్ష రాయొచ్చని అధికారులు చెప్పారు. విద్యార్థులు ఏమైనా ఇబ్బందులకు గురైతే 040–24601010 లేదా 040–24655021కు కంట్రోల్‌రూం నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని ఇంటర్‌ బోర్డు తెలిపింది.

చదవండి: ఆలస్యమైనా తప్పనిసరి

మరిన్ని వార్తలు