Telangana Inter Exams 2022: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

7 Feb, 2022 19:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు సోమవారం షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు.. ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12 న ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్ష ఉండనుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్ష తేదీలను ఖరారు చేసింది.

ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌..
►ఏప్రిల్ 20 న పేపర్ 1 తెలుగు/ సంస్కృతి

►ఏప్రిల్ 22 న ఇంగ్లీష్ పేపర్ 1

►ఏప్రిల్ 25న మాథ్స్ పేపర్1A, బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1

►ఏప్రిల్ 27న మాథ్స్ పేపర్ 1B జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్1

►ఏప్రిల్ 29న ఫిజిక్స్ పేపర్ 1, ఎకానమిక్స్ పేపర్1

►మే 2న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్..

►ఏప్రిల్ 21న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్ 2,

►ఏప్రిల్ 23 న ఇంగ్లిష్‌ పేపర్ 2

►ఏప్రిల్ 26న మాథ్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2,  పొలిటికల్ సైన్స్ పేపర్ 2,

►ఏప్రిల్ 28న మాథ్స్ పేపర్ 2B, జూవాలజీ పేపర్2, హిస్టరీ పేపర్ 2

►ఏప్రిల్ 30న ఫిజిక్స్ పేపర్ 2, ఎకానమిక్స్ పేపర్ 2,

►మే 5న కెమిస్ట్రీ పేపర్2, కామర్స్ పేపర్2

మరిన్ని వార్తలు