మహిళా స్టార్టప్‌లకు కొత్త ప్రోత్సాహకాలు

28 Jul, 2021 08:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఐటీశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు స్థాపించిన స్టార్టప్‌లను వర్గీకరిస్తూ మంగళవారం ఐటీ కమ్యూనికేషన్ల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వద్ద నమోదైన స్టార్టప్‌లలో మహిళల వాటా 33% ఉంటే, ఇకపై వాటిని మహిళా స్టార్టప్‌లుగా.. స్టార్టప్‌లలో వారివాటా 20% ఉంటే మహిళా ఎంటర్‌ ప్రెన్యూ ర్లుగా గుర్తిస్తారు. రాష్ట్రంలో 2 కోట్ల కంటే ఎక్కువ మంది గ్రామాల్లోనే ఉంటున్నారు. 

దీంతో సాంకేతికత లోపం, సంప్రదాయ వ్యవసాయ విధానాలను అనుసరించటం, ఆర్థిక వెనుకబాటు, నిరక్షరాస్యత వంటివి వారి ఎదుగదలను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఐటీశాఖ ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది. క్షేత్ర స్థాయి ఆవిష్కరణల్లో ఎంపికైన వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు గ్రాంటుగా అందజేస్తుంది. కాగా, ప్రభుత్వం 2017లో ప్రకటించిన ఎస్‌జీఎస్‌టీ, పేటెంట్‌ ధర, ఇంట ర్నేషనల్‌ మార్కెట్, రిక్రూట్‌మెంట్‌ అసెస్‌మెంట్, పనితీరు ఆధారిత గ్రాంటు తదితర విషయాల్లో గతంలో ప్రకటించిన మార్గదర్శకాల్లో తాజాగా స్వల్ప మార్పులు చేసింది.     
 

మరిన్ని వార్తలు