‘క్షమాపణ చెప్పినా హైపర్‌ ఆదిని వదలం.. బుద్ధి చెప్తాం’

16 Jun, 2021 05:06 IST|Sakshi
(ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: ఓ టీవీలో ప్రసారమైన షోలో జబర్దస్త్‌ నటుడు హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిపై చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా హైపర్‌ ఆది ఆ వ్యాఖ్యలకు క్షమాపణ తెలిపారు. అయితే ఆయన క్షమాపణలు చెప్పినా కూడా తాము వదిలేది లేదని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఆది క్షమాపణలు చెప్పిన అనంతరం ఆ సంస్థ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ స్పందించారు. హైపర్‌ ఆదిని బాధపెట్టడం.. క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదు అని తెలిపారు. 

సంస్కృతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తాము ఆరోపణలు చేస్తున్నట్లు హైపర్‌ ఆది అనడం సిగ్గుచేటు అని నవీన్‌ గౌడ్‌ తెలిపారు. ఇప్పటికీ కూడా పశ్చాత్తాప పడకుండా కేవలం తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఈ వ్యాఖ్యలను గమనిస్తున్నారని చెప్పారు. సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎక్కడ కూడా మేము తగ్గేది లేదని.. కచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఏదో అతని పర్సనల్ పేజీలో వీడియో పెట్టుకొని చేతులు దులుపుకునే ధోరణి సహించేది లేదు అని పేర్కొన్నారు.

చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్‌ ఆది
చదవండి: నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్‌ ఆది

మరిన్ని వార్తలు