జేపీఎస్‌ల పారితోషికం, ఒప్పందం కాలం పెంపు..

20 Jul, 2021 10:48 IST|Sakshi

జేపీఎస్‌ల పారితోషికం పెంపు.. ఒప్పందకాలం కూడా

రెగ్యులర్‌ స్కేల్‌ ఇవ్వాలన్న జేపీఎస్‌ల సంఘం

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలకు (జేపీఎస్‌) సంబంధించి తీపి, చేదు కలగలిపిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం జేపీఎస్‌లకు నెలకు ఇస్తున్న రూ.15 వేల కన్సాలిడేట్‌ పారితోషికాన్ని రూ. 28,719కు పెంచింది. అలాగే, గతంలో ప్రొబేషనరీ పీరియడ్‌లా పరిగణించే మూడేళ్ల ఒప్పంద కాలాన్ని నాలుగేళ్లకు పొడిగిస్తూ మరో నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయాలు ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు (ఎఫ్‌ఏసీ) ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2018 ఆగస్టు 31న 9,355 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో ఎంపికైన జేపీఎస్‌లకు మూడేళ్ల ఒప్పంద కాలం ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు దీన్ని నాలుగేళ్లకు పొడిగించారు. 

మూకుమ్మడి రాజీనామాలకైనా సిద్ధం: జేపీఎస్‌ సంఘం
జేపీఎస్‌ల పారితోషికం, ఒప్పంద కాలాన్ని పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ను వెంటనే వెనక్కు తీసుకోవాలని జేపీఎస్‌ల సంఘం అధ్యక్షుడు వెంకట్‌ నిమ్మల గౌడ్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సైదారెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధమ ని చెప్పారు. మంగళవారం భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కాగా, జేపీఎస్‌లకు వేతనం పెంపును స్వాగతించిన తెలంగాణ పంచాయతీ కార్యద ర్శుల సంఘం.. అగ్రిమెంట్‌ పీరియడ్‌ను నాలుగేళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిం చింది. ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పడం సబబు కాదని సంఘం నేతలు పి.మధుసూదన్‌ రెడ్డి, ఎ.రమేష్‌ చెప్పారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు