ఆర్టీఏకు వచ్చిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌

1 Dec, 2021 01:21 IST|Sakshi
లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం డిజిటల్‌ సంతకం చేస్తున్న చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. తన డ్రైవింగ్‌ లైసెన్సు రెన్యువల్‌ కోసం ఆయన నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి రావడం గమనార్హం.

రవాణా కమిషనర్‌ ఎం.ఆర్‌.ఎం రావు, హైద రాబాద్‌ జేటీసీ పాండురంగ నాయక్, ప్రాం తీయ రవాణా అధికారి రాంచందర్‌ తదితరులు చీఫ్‌ జస్టిస్‌కు సాదరస్వాగతం పలికారు. నిబంధనల మేరకు డ్రైవింగ్‌ లైసెన్సు కాలపరిమితిని పునరుద్ధరించి అందజేశారు. 

మరిన్ని వార్తలు