Telangana: నేడు, రేపు భారీ వర్షాలు 

28 Sep, 2021 02:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలుకురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో కుండపోత వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గులాబ్‌ తుపాను సోమవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడిందని, మంగళవారం ఉదయం నుంచి దాని ప్రభావం తగ్గిపోతుందని పేర్కొంది. అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్త నం ఏర్పడిందని.. దాని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని వెల్లడించింది.

ఇప్పటికే 35శాతం అధికం 
జోరు వానలతో భారీగా వర్షపాతం నమోదవుతోందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి సీజన్‌లో సాధారణంగా ఇప్పటివరకు 70.72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని.. ఈసారి సోమవారం ఉద యం వరకు 95.70సెంటీమీటర్లుగా నమోదైందని పేర్కొంది. సాధారణ వర్షపాతం కంటే ఇది 35% అధికమని తెలిపింది. ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 21 జిల్లాల్లో అధికం, 7 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని పేర్కొంది.

అప్రమత్తంగా ఉండండి
భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై కేసీఆర్‌ సోమవారం ఢిల్లీలో సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఇతర అధికారు లతో సమీక్షించారు. పోలీసు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయం తో కృషి చేయాలని, తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. ఇక సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  అవసరమైతే హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్‌లోని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ ఏర్పా టుచేసి పరిస్థితిని పర్యవేక్షించాలని.. ముఖ్య సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు తెలి యజేయాలని చెప్పారు.  కాగా.. జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయా లని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. 

మరిన్ని వార్తలు