లాక్‌డౌన్‌: వైన్స్‌, మార్ట్‌ల్లో మద్యం ఖాళీ

11 May, 2021 22:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ అని ప్రకటించగానే మందుబాబులు షాక్‌కు గురయ్యారు. పది రోజుల లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడిన వెంటనే మద్యంప్రియులు వైన్స్‌ దుకాణాలు, మార్ట్‌లకు పరుగులు పెట్టారు. గతేడాది అనుభవం దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా మద్యం కొనుగోలుకు ఎగబడ్డారు. ఏ మద్యం దుకాణం చూసినా కూడా మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు కిటకిటలాడాయి. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర క్యూలైన్‌ కొనసాగాయి. మద్యం దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటలకు తెరచి ఉంటుందని తెలిసినా కూడా మందు కోసం ఎగబడ్డారు.

సంపన్నులతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా తమ స్థాయికి మించి మద్యం కొనుగోళ్లు చేశారు. కొందరు తమ వద్ద డబ్బు లేకున్నా అప్పు చేసి మరి మద్యం తీసుకెళ్లారు. ఈ పది రోజులకు సరిపడా తీసుకెళ్లారు. మరికొందరేమో లాక్‌డౌన్‌ గడువు పెరుగుతుందని భావించి భారీగా కొనుగోలు చేశారు. మద్యం దుకాణాలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో నిర్వాహకులు, యజమానులు ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. ఉన్న అరకొర సిబ్బందితోనే విక్రయాలు కొనసాగించారు. మద్యంప్రియులు ఒక్కసారిగా ఎగబడడంతో మద్యం దుకాణాల్లో స్టాకంతా అయిపోయింది. నో స్టాక్‌ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సాధారణ మద్యం దుకాణం నుంచి వైన్స్‌ మార్ట్‌ వరకు ఇదే పరిస్థితి. ఒక వైన్స్‌ మార్ట్‌లో మద్యం సీసాలన్నీ ఖాళీ అవడంతో కబోర్డులన్నీ వెలవెలబోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ
చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా

హైదరాబాద్‌లోని ఓ వైన్స్‌ మార్ట్‌లో ఖాళీగా ఉన్న ర్యాక్‌లు

మరిన్ని వార్తలు