‘లైట్‌’ తీస్కోలేదు.. కూకట్‌పల్లిలో ఓ బైక్‌ కహానీ

24 May, 2021 13:01 IST|Sakshi

ఉదయం 11.15.. కూకట్‌పల్లిలోని గోవింద్‌ హోటల్‌ చౌరస్తా.. సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు.. ఇంతలో సార్‌సార్‌ అంటూ కొందరు పోలీసులు వచ్చారు.. ఒక అతితెలివి వాహనదారుడిని ఆయన ముందు నిల్చోబెట్టారు.

తను తన బైకు ముందు, వెనకాల ఎల్‌ఈడీ ఫోకస్‌ లైట్లను అమర్చాడు. ఈ లైట్ల వల్ల కెమెరాలో ఫొటో తీసినప్పుడు రిఫ్లెక్షన్‌ వచ్చి.. బండి నంబర్‌ ఫొటోలో సరిగా కనపడదు. కొన్నిసార్లు ఎదురుగా వచ్చే వాహనాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది.. దీన్ని స్వయంగా పరిశీలించిన కమిషనర్‌ ఆ లైట్లను తీసేయించి.. ఆ బండిని సీజ్‌ చేయమని ఆదేశించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో పోలీసులు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపైకి వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఉల్లంఘనుల వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధిస్తున్నారు. 

Lockdown: సజ్జనార్‌ వస్తున్నారు.. వెంటనే ఖాళీ చేయండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు