కేసీఆర్, కడియం దళితద్రోహులు: మందకృష్ణ

1 Mar, 2022 02:36 IST|Sakshi
అభివాదం చేస్తున్న మంద కృష్ణ, హరగోపాల్, కోదండరాం, బెల్లయ్య నాయక్‌ 

స్టేషన్‌ఘన్‌పూర్‌: దళిత ద్రోహులైన సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి రాజకీయ సమాధి తప్పదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. రాజ్యాంగానికి కేసీఆర్‌ రూపంలో వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవాలన్న నినాదంతో ఏప్రిల్‌ 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి బహిరంగ సభకు సన్నాహకంగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ దురహంకారంతో రాజ్యాంగంపై వ్యాఖ్య లు చేశారన్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలకు శ్రీహరి  వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు.   రాజ్యాంగబద్ధంగా ఉద్యమాలు చేసి కేసీఆర్‌ సీఎం అయ్యారని, ఇప్పుడు ఆ రాజ్యాంగాన్నే మార్చాలనడం సమంజసం కాదని ప్రొ. హరగోపాల్‌ అన్నారు. రైతులు, నిరుద్యోగులు, కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్‌కు పట్టదని ప్రొ.కోదండరాం అన్నారు. కార్యక్రమంలో ప్రొ.ఖాసీం, బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్, దళిత హక్కుల నేత జేబీ రాజు, ఎల్‌హెచ్‌పీఎస్‌ నేత బెల్లయ్యనాయక్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు