ములుగు: మాజీ సర్పంచ్‌‌ని కిడ్నాప్ చేసి, హత్యచేసిన మావోయిస్టులు

22 Dec, 2021 13:13 IST|Sakshi
మావోయిస్టులు హత్య చేసిన రమేశ్‌

సాక్షి, వరంగల్‌: ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. కిడ్నాప్‌కు గురైన మాజీ సర్పంచ్ కురుసం రమేష్‌ను చంపేశామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించడంతోనే హత్య చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. రమేష్ స్వగ్రామం ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు పంచాయతీ పరిధిలోని కే కొండాపురం. 2014లో సర్పంచ్‌గా ఎన్నికైన రమేష్.. ప్రస్తుతం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 

ఆయన భార్య రజితకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో ఏఎన్‌ఎం ఉద్యోగం రావడంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్‌ సమీపంలో నివాసం ఉంటున్నారు. రమేశ్‌ వృత్తిరీత్యా డ్రైవర్‌ కావడంతో ఖాళీ సమయంలో ఎవరికైనా డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు పోయే పని ఉందని ఇంట్లో చెప్పి వెళ్లిన రమేష్‌ కిడ్నాప్‌కు గురయ్యాడు.
చదవండి: ఒమిక్రాన్‌ దడ, థర్డ్‌వేవ్‌ హెచ్చరిక.. ‘బూస్టర్‌’ వైపు పరుగులు..

కాగా 2019లో రమేష్ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారి పాలపొడిలో విషం కలిపి ఇచ్చాడని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. విషం కలిపిన పాలపొడితో కామ్రేడ్ బిక్షపతి అలియాస్ విజేందర్ అమరుడయ్యాని పేర్కొన్నారు. అదే విధంగా రమేష్ ఒక ఎన్‌కౌంటర్ చేయించి రెండు లక్షలు తీసుకున్నాడని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. పార్టీకి, ప్రజలకు ద్రోహం తలపెట్టడంతోనే ప్రజాభిప్రాయం మేరకు రమేష్‌ను హత్య చేశామని తెలిపారు. పోలీసులు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇన్‌ఫార్మర్‌గా మారితే రమేష్‌కు పట్టిన గతే పడుతుందని మావోయిస్ట్ పార్టీ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత హెచ్చరించారు.
చదవండి: క్రికెట్‌ టోర్నీలో చాన్స్‌ ఇస్తామని చెప్పి.. మహిళా క్రికెటర్‌ను..

మరిన్ని వార్తలు