అలర్ట్‌: హైదరాబాద్‌లో మూడు నాలుగు గంటలపాటు ఈ రూట్‌లలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు

16 Aug, 2022 09:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం సందర్భంగా.. రాజధాని నగరంలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు నెలకొన్నాయి. రాష్ట్రం మొత్తం ఒకేసారి జగగణమన ఆలపించేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 

మంగళవారం ఉదయం 11.30 ప్రాంతంలో ఎక్కడికక్కడే అంతా ఆగిపోయి.. జాతీయ గీతం పాడేలా కార్యక్రమం రూపొందించింది కేసీఆర్‌ సర్కార్‌. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.30 దాకా నగరంలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు ప్రకటించారు. అయితే ఉదయం నుంచే చాలాచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ కావడం విశేషం. అంతేకాదు మూడు గంటల తర్వాత కూడా ట్రాఫిక్‌ జామ్‌ కష్టాలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

లిబర్టీ, బషీర్‌బాగ్‌, జగ్జీవన్‌రామ్‌ జంక్షన్‌, కింగ్‌కోఠి, అబిడ్స్‌లో భారీగా ఆంక్షలు ఉండనున్నాయి. కాబట్టి, ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులకు సూచనలు జారీ అయ్యాయి. ఈ ట్రాఫిక్‌ ఎఫెక్ట్‌తో.. డైవర్షన్‌ మూలంగా మరికొన్ని చోట్ల కూడా వాహన దారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నాయి.

కార్యక్రమంలో భాగంగా ఉదయం 11గం.30ని.కు.. అన్ని ట్రాఫిక్‌ కూడళ్లలో నిమిషం పాటు రెడ్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే చాలా చోట్ల భారీగా ట్రాఫిక్‌ ఝామ్‌ అవుతోంది. కోఠిలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఐదు వేల మంది విద్యార్థులు జాతీయ గీతాలాపనలో పాల్గొననున్నారు.

అబిడ్స్‌ జీపీవో దగ్గర చౌరస్తాలో నెహ్రూ విగ్రహం వద్ద జాతీయ గీతాలాపనలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్‌. కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్ననున్నారు. 

మరిన్ని వార్తలు