T-Diagnostics App: టీ–డయాగ్నొస్టిక్‌ మొబైల్‌ యాప్‌.. అరచేతిలో ఆరోగ్య రిపోర్ట్‌

12 May, 2022 10:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీ–డయాగ్నొస్టిక్‌ మొబైల్‌యాప్‌లో టీ–డయాగ్నొస్టిక్‌ సెంటర్‌లో చేయించుకున్న అన్ని రకాల వైద్యపరీక్షల రిపోర్టులను ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య వివరాలన్నీ యాప్‌లో తెలుసుకోవచ్చు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం డయాగ్నొస్టిక్‌ యాప్‌ను తీసుకురావడం విశేషం. 

యాప్‌లో ఏముంటాయి?
► దగ్గరలోని సర్కారు దవాఖానాలు, ప్రభుత్వ డయాగ్నొస్టిక్‌ కేంద్రాల చిరునామాను తెలుసుకోవచ్చు. అవసరమైన స్పెషలైజేషన్‌ వైద్యం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులనూ వెతుక్కోవచ్చు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఆ కేంద్రానికి వెళ్లొచ్చు. 
► వైద్య పరీక్షల కోసం నమూనాలు ఇచ్చినట్లయితే, టెస్టుల స్టేటస్‌తోపాటు రిపోర్టులు కూడా చూసుకోవచ్చు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
►  ఆసుపత్రుల్లోని సేవలపై వైద్యులు, నర్సులు, సిబ్బంది, ఆశ వర్కర్లు తమ అభిప్రాయాలను యాప్‌ ద్వారా తెలపవచ్చు. 
►  రోగులు వైద్య సేవలకు సంబంధించిన అసౌకర్యాలపై ఫిర్యాదు చేయొచ్చు. 
►  పాత వైద్య పరీక్షల రిపోర్టులను చూసుకునే సౌకర్యం ఉండటం వల్ల.. డాక్టర్‌ వద్దకు వెళ్లినప్పుడు ఆ రిపోర్టులను మొబైల్‌ఫోన్‌ ద్వారా వెంటనే చూపొచ్చు.
►  రోగి లేదా బాధితుడు ఏవైనా సందేహాల నివృత్తి కోసం నేరుగా సమీప ఆసుపత్రికి కాల్‌ చేయొచ్చు.
►   రోగులు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో యాప్‌లోకి వెళ్లి తమ ఫొటో అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.. అలాగే ప్రొఫైల్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు. 
►   కస్టమర్‌ సపోర్ట్‌ కాంటాక్ట్‌లు, ఇతర ప్రభుత్వ హెల్త్‌ వెబ్‌సైట్‌ లింక్‌లు కూడా ఉంటాయి.

చదవండి: Lavanya: అందరికీ చెబుతుందనే లావణ్య హత్య

మరిన్ని వార్తలు