కరోనా నియంత్రణకు ద్విముఖ వ్యూహం: సీఎం కేసీఆర్‌

24 May, 2021 21:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి  రాష్ట్రంలో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌పై సీఎం అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. సమీక్ష అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఫీవర్ సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందించే విధానం కొనసాగిస్తూనే, పీహెచ్‌సీకి వచ్చిన ప్రతిఒక్కరికీ కరోనా పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. ర్యాపిడ్ యాంటిజెన్‌ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలన్నారు. కరోనా పరీక్షల సంఖ్యను మరింత పెంచాలని అధికారులకు తెలిపారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో చికిత్స కోసం రాష్ట్రంలో అవసరమైన మందులు సమకూర్చుకోవాలిని అధికారులను ఆదేశించారు.

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌ను కఠినతరం చేయాలిని పోలీసులను ఆదేశించారు. కరోనా నియంత్రణకు ఎంతటి ఖర్చుకైనా వెనకాడవద్దని ఈ క్రమంలో పోలీస్, వైద్యారోగ్య శాఖలకు బడ్జెట్‌ పెంచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ పెంపు అంశంపై మంత్రి హరీష్‌రావుకు సమీక్షించాలని ఆదేశించారు. కరోనాను కట్టడి చేసిన ఢిల్లీ లాంటి అర్బన్ కేంద్రాల్లో అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఆక్సిజన్ ఉత్పత్తిని 600 ఎంటీలకు పెంచేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రెండో డోస్‌కు అవసరమైన వ్యాక్సిన్లను సమకూర్చుకోవడంతో పాటు థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలిని సీఎం సూచించారు.

చదవండి: Hyderabad: సాబ్‌.. ఛోడ్‌దో సాబ్‌.. 

మరిన్ని వార్తలు