గల్ఫ్‌లో కార్మికుల గోస.. ఆదుకోవాలని వేడుకోలు

29 Apr, 2021 14:56 IST|Sakshi
క్యాంప్‌లో నిరసన తెలుపుతున్న కార్మికులు 

దుబాయ్‌లో మూడు నెలలుగా అందని వేతనాలు

ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు  

సాక్షి, జగిత్యాల: స్వగ్రామంలో ఉపాధి కరువై దుబాయ్‌ వెళ్లిన గల్ఫ్‌ కార్మికులకు వేతన కష్టాలు మొదలయ్యాయి. మూడు నెలలుగా వేతనాలు లేక, తిండికి కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో రాష్ట్రానికి చెందిన 17 మంది కార్మికులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దుబాయ్‌లోని ఇన్వెస్టర్‌ టెక్నికల్‌ కంపెనీలో పనిచేసేందుకు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఏడుగురు, నిర్మల్‌కు చెందిన ఆరుగురు, జగిత్యాలకు చెందిన ఒకరు, రాజన్న సిరిసిల్లకు చెందిన ఒకరు, కామారెడ్డికి చెందిన ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒకరు ఆరేళ్ల క్రితం వెళ్లారు.

మూడు నెలలుగా కంపెనీలో పని లేకపోవడంతో వేతనాలు ఇవ్వడం నిలిపివేశారు. దీంతో కార్మికులు తిండికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కంపెనీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. 

ఇక్కడ చదవండి: 
తెలంగాణలో లాక్‌డౌన్‌ ఆలోచన లేదు: మంత్రి ఈటల

Vemulawada: కక్కుర్తిపడ్డ ఉద్యోగి.. భోళా శంకరునికే బురిడీ..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు