పీహెచ్‌సీల్లో సత్వర చికిత్సలు 

6 Dec, 2022 03:31 IST|Sakshi

మంత్రి హరీశ్‌రావు సమీక్ష  

సాక్షి, హైదరాబాద్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సత్వరంగా వైద్య చికిత్సలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గతంలో పోల్చితే పీహెచ్‌సీల్లో మార్పు కనిపిస్తోందనీ ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పీహెచ్‌సీల్లో సమర్థవంతంగా వైద్య సేవలు అందించగలిగితే బోధనాసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ప్రజలకు సేవ చేసే వైద్య సిబ్బందిని ప్రభుత్వం తప్పనిసరిగా గుర్తిస్తుందని హామీనిచ్చారు. సోమ వారం ఆయన అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు, ఏఎన్‌ఎంలు మంచిగా పనిచేస్తున్నారని కొనియాడారు. గ్రా మాల పరిధిలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యంపై ఆశాలు, ఏఎన్‌ఎంలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. త్వరలోనే గర్భిణీల కోసం న్యూట్రిషన్‌కిట్లను అందజేస్తామనీ, క్షేత్రస్థాయి వైద్యసిబ్బంది జాగ్రత్తగా పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. కాగా, గర్భిణీలకు అందుతున్న వైద్యసేవల పై ఆరా తీసేందుకు మంత్రి హరీశ్‌రావు వీ డియో లేదా టెలీ కాన్ఫరెన్స్‌ పద్ధతిలో నేరు గా వారితో మాట్లాడాలని నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు