డబుల్‌ బెడ్రూం ఇల్లు వెనక్కి

6 Aug, 2022 01:04 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట జోన్‌: ‘గత కొన్నేళ్లుగా సిద్దిపేట పట్టణంలో కిరాయి ఇంట్లో ఉంటున్న. డబుల్‌ బెడ్రూం ఇల్లు వచ్చింది. కానీ అనారోగ్యంతో ఉన్న కొడుకును పట్టుకొని డబుల్‌ బెడ్రూం కాలనీలో ఉండలేను. ఇల్లు అవసరం ఉన్న నాలాంటి పేద వారికి నా ఇల్లు ఇవ్వండి’ అని సిద్దిపేట పట్టణానికి చెందిన కూరేళ్ల రూప.. మంత్రి హరీశ్‌ రావుకు ప్రభుత్వం తనకిచ్చిన డబుల్‌ బెడ్రూం పట్టా పత్రాలు, ఇంటి తాళం తిరిగి ఇచ్చి ఆద ర్శంగా నిలిచింది.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ఆమె నిజాయితీని అభినందించారు. అర్హులైన వారికి బుల్‌ బెడ్రూం ఇళ్లు దక్కాలని ఆయన ఆకాంక్షించారు. (క్లిక్‌: ఒక్కో సహజ ప్రసవానికి రూ.3వేలు)

మరిన్ని వార్తలు