మున్ముందు అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో యోగా

22 Jun, 2022 01:44 IST|Sakshi
యోగాసనాలు వేస్తున్న మంత్రి హరీశ్‌రావు 

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ 

సిద్దిపేటజోన్‌/పెద్దపల్లి: భవిష్యత్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యోగా ప్రక్రియ అమలు చేయనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ‘‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా గర్భిణులకు సులువైన యోగాసనా లు నేర్పిస్తున్నాం. గర్భిణుల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదం చేస్తుంది’’ అని అన్నారు.

8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని ఆయుష్‌ విభాగం నిర్వహించిన యోగా డేలో మంత్రి మాట్లాడారు. సాధారణ ప్రసవాలు పెంచేందుకు ఆశ కార్యకర్తల కు, వైద్యసిబ్బందికి యోగా శిక్షణ ఇచ్చామని తెలి పారు. ఇప్పటికే సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం జిల్లా ఆసుప త్రుల్లో యోగా ప్రక్రియ అమలులో ఉందని పేర్కొ న్నారు. భవిష్యత్‌ అంతా ఆయుష్‌ విద్యార్థులదేనని, నేచు రోపతి విద్యకు బోలెడు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంతకు ముందు మంత్రి ఇక్కడ కొద్దిసేపు యోగాసనాలు కూడా వేశారు.

డబుల్‌ ఇంజిన్‌ కాదు.. ట్రబుల్‌ ఇంజిన్‌! 
‘నీతి ఆయోగ్‌ లెక్కల ప్రకారం వైద్య సదుపా యాల కల్పనలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు కూడా బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాలే. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉన్న ఉత్తరప్రదేశ్‌ మాత్రం 28వ స్థానంలో ఉంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అంటే ట్రబులే’అని హరీశ్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు.

మరిన్ని వార్తలు