ప్రాణం పోసే డాక్టర్లు ఎంతో ముఖ్యం: హరీశ్‌రావు

18 Aug, 2022 00:55 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు 

గచ్చిబౌలి: దేశానికి అన్నంపెట్టే రైతు, దేశాన్ని కాపాడే సైనికులు ఎంత ముఖ్య మో ప్రాణం పోసే డాక్టర్లు కూడా అంతే ముఖ్యమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని మెరిడిన్‌ హోటల్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో వైద్య రంగంలో కృషి చేసిన 75 మంది వైద్యులకు అవార్డులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వైద్య రంగం ఎంతో బలోపేతమైందన్నారు.

2014లో రాష్ట్రంలో 17 వేల పడకలుంటే ఆ సంఖ్యను 27 వేలకు పెంచిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మూడం­చెల వ్యవస్థను ఐదంచెల వ్యవస్థకు పెంచామని, ప్రిమి టివ్, సూపర్‌ స్పెషాలిటీ అంచెలను యాడ్‌ చేశామని తెలిపారు. 4 వేలకు పైగా పల్లె దవాఖా­నాలు, 390 బస్తీ దవాఖా నాలు ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల, ఒక నర్సింగ్‌ కాలేజ్‌ ఉండేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మెడికల్‌ టూరిజమ్‌ హబ్‌గా తెలంగాణ మారిందని, విదేశాల నుంచి ఎంతోమంది రోగులు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు.  

బతుకమ్మ రోజున న్యూట్రిషన్‌ కిట్‌
ఆశ, ఏఎన్‌ఎంల ద్వారా ప్రజలను జాగృతం చేస్తున్నామని హరీశ్‌ వెల్లడించారు. బతుకమ్మ పర్వదినాన కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ ఇవ్వాలని నిర్ణ­యిం­­చామని తెలిపారు. బిడ్డ కడు­పులో పడగానే ఈ న్యూట్రిషన్‌ కిట్, డెలివరీ కాగానే కేసీఆర్‌ కిట్‌ను అందిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు