మొక్కలు నాటడం జీవన విధానంలో భాగం కావాలి: ఇంద్రకరణ్‌రెడ్డి

15 Sep, 2022 03:05 IST|Sakshi
జమ్మిమొక్కను నాటుతున్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్, కొత్తప్రభాకర్‌రెడ్డి తదితరులు  

ప్రతి ఊరిలో జమ్మిచెట్టు నాటే కార్యక్రమం: ఎంపీ సంతోష్‌  

గచ్చిబౌలి(హైదరాబాద్‌): మొక్కలు నాట­డం జీవన విధానంలో భాగం కావాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బొటానికల్‌ గార్డెన్‌లో ఆయన జమ్మిచెట్టు నాటి రెండో విడత గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించా­రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జమ్మి వృక్షం పవిత్రమైందని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా ప్రకటించిందని తెలిపారు.

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రతిగ్రామంలోనూ 1.20 లక్షల జమ్మిచెట్లను నాటేందుకు అటవీ, దేవాదాయ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయని చెప్పారు. బొటానికల్‌ గార్డెన్స్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ గౌరవా­ధ్యక్షుడిగా సంతోశ్‌ కుమార్‌ను ఎన్నుకున్నారు. ఊరూరా జమ్మిచెట్టు–గుడిగుడిలో జమ్మిచెట్టు, వాకర్స్‌ అసొసి­యేషన్‌ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా రన్‌ ఫర్‌ పీస్‌ కార్యక్రమం పోస్టర్, టీషర్ట్స్‌ ఆవిష్కరించారు. కార్య­క్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భరత్‌రెడ్డి, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు