కృష్ణాలో వాటా తేల్చకపోవడం సిగ్గుచేటు: కేటీఆర్‌

25 Apr, 2022 02:34 IST|Sakshi
నలంద పబ్లిక్‌ స్కూల్‌లో చదివిన రోజుల్లో టీచర్లు, తోటి మిత్రులతో కలిసి కేటీఆర్‌ దిగిన ఫొటో 

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ల తర్వాత కూడా కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను ఎన్‌పీఏ (నిరర్ధక) ప్రభుత్వం తేల్చక పోవడం సిగ్గుచేటు’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి రాజీపడే ధోరణిలో రాజకీయాలు ఉండకూడదు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వెన్నెముకలేని రాష్ట్ర బీజేపీ నాయకులు గొంతెత్తగలరా’ అని ట్విట్టర్‌ వేదికగా ఆయన ఆదివారం ప్రశ్నించారు. 

నలంద విద్యార్థిగా కేటీఆర్‌
‘నలంద పబ్లిక్‌ స్కూల్‌ 1988 బ్యాచ్‌ జ్ఞాపకాలు ఏవైనా గుర్తున్నాయా’ అంటూ కేటీఆర్‌ తన సహాధ్యాయులతో దిగిన పాత ఫోటోను నెటిజన్‌ ఒకర్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ ‘నలందలో నేను హాస్టల్‌లో గడిపిన పాత జ్ఞాపకాలు బాగా గుర్తుకు వచ్చాయి’ అని రీట్వీట్‌ చేశారు. గతంలో సచిన్, షారుఖ్‌ఖాన్‌తో దిగిన ఫోటోను జత చేస్తూ... క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  

మరిన్ని వార్తలు