అమిత్‌ షాకు కేటీఆర్‌ బహిరంగ లేఖ

13 May, 2022 20:20 IST|Sakshi

హైదరాబాద్‌: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందని పేర్కొన్న కేటీఆర్‌.. తెలంగాణపై వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణ రాష్ట్రంపై అదే వివక్ష కొనసాగుతుందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్రం ఏం చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పాలని కేటీఆర్‌ లేఖ ద్వారా డిమాండ్‌ చేశారు.

చదవండి👉 బండి సంజయ్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

మరిన్ని వార్తలు