ఏపీని ముందుండి నడిపిస్తున్న పాలనాదక్షుడు సీఎం జగన్‌: మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు

22 Sep, 2022 16:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసలతో ముంచెత్తారు. ఏపీ కష్టాల్లో కూరుకుపోయినపుడు జగన్‌ ముందుండి నడిపించిన తీరును ఆయన కొనియాడారు. రీ డిజైన్‌ చేసిన హిందూ ఇంగ్లీష్‌ పేపర్‌ను బుధవారం కేటీఆర్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హిందూ ఎడిటోరియల్‌ టీమ్‌తో మాట్లాడిన కేటీఆర్‌.. సంక్షేమ పథకాలపై ఫోకస్‌ పెట్టిన వైఎస్‌ జగన్‌ అభివృద్ధిని పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని కొంత మంది చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కరోనా వైరస్‌ ఉధృతిలోనూ ఏపీ ఆర్థిక పరిస్థితిని జగన్‌ చక్కదిద్దారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

చదవండి: (వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్ష పదవిపై సజ్జల క్లారిటీ)

మరిన్ని వార్తలు