28న టీ–హబ్‌ రెండో దశ ప్రారంభం 

24 Jun, 2022 00:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రం ‘టీ–హబ్‌’రెండో దశను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. రాయదుర్గంలోని టీ–హబ్‌ భవనంలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీ–హబ్‌ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ప్రసంగాలు, చర్చాగోష్టులు ఉంటాయి.

డ్రాయిన్‌ బాక్స్, మీషో, స్విగ్గీ, ప్రిస్టిన్‌కేర్, డెలివరీ వంటి యూనికార్న్‌ సంస్థలు, సిక్వోయా క్యాపిటల్, యాక్సెల్, కలారీ క్యాపిటల్స్‌ వంటి వెంచర్‌ క్యాపిటలిస్టు సంస్థలు, సాప్, మారుతి సుజుకీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులు టీ–హబ్‌ రెండో దశ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

2016లో టీ–హబ్‌ రెండో దశకు శంకుస్థాపన చేయగా 2020 నాటికి అందుబాటులోకి వస్తుందని భావించారు. అయితే కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణం ఆలస్యం అయింది. ఇటీవల పనులు పూర్తి కావడంతో ఈ నెల 28న ప్రారంభించేందుకు ఐటీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 

మరిన్ని వార్తలు