చెప్పుతో కొట్టుకుంటావా? బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌

20 Dec, 2022 17:36 IST|Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల:  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. డ్రగ్స్‌ టెస్ట్‌ కోసం తాను రెడీ అంటూనే.. బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన. 

డ్రగ్స్‌ టెస్ట్‌ కోసం నా రక్తం, కిడ్నీ, బొచ్చు.. ఏది కావాలంటే అది ఇస్తా. ఇక్కడే ఉంటా. డాక్టర్లను తీసుకుని రా? క్లీన్‌చిట్‌తో బయటకు వస్తా. చెప్పినట్లు బండి సంజయ్‌ తన చెప్పుతో తనను తాను కొట్టుకుంటాడా? అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. 

జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌ మనిషా? పశువా? అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు కేటీఆర్‌. ఫాల్తూ మాటల రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు.  నాకు క్లీన్‌చిట్‌ వస్తే కరీంనగర్‌లో కమాన్‌ దగ్గర సంజయ్‌ చెప్పుతో తనను తాను కొట్టుకుంటాడా? అని మండిపడ్డారు కేటీఆర్‌. ఇంకా ఆయన ఏమన్నారంటే..

👉రైతు బంధు రూ. 65 వేల కోట్ల ఇచ్చిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం. ఇంత కన్నా మేలు చేసిన ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయా?.

👉కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనం అన్నా.. కేసీఆర్ నాయకత్వం కొన్నది. ఎర్రటి ఎండలో నీటి ప్రవాహం వచ్చింది అంటే కేసీఆర్ ఘనత కాదా?.

👉ఇక్కడ నిలబడ్డ బిజెపి అభ్యర్థులను కోరుతున్నా.. నేతన్న కార్మికులకు,  రైతులకు మీరు ఏమైనా చేశారా?. బండి సంజయ్‌ను  అడుగుతున్నా.. భైంసా ను దత్తత తీసుకున్న అంటున్నావు తీసుకో కానీ నీవు గెలిచిన నీ నియోజక వర్గంలో ఎం చేసినావు?

👉వేములవాడ కు 100 కోట్ల తో అభివృద్ది చేపించావా?.

👉IIIT అడిగాము. కానీ అదికూడా తీసుకు రాలేవు. ఈ బడ్జెట్ కి ఎంపికి ఇదే చివరి అవకాశం. ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలకు ఏమైనా తీసుకు రా. బడ్జెట్ సమావేశాలకు వెళ్లు.. హిందీ రాకపోతే ఇంగ్లీష్ మాట్లాడు.  కానీ, కరీంనగర్ కు ఏమైనా తీసుకు రా.

👉ఇద్దరు గుజరాత్ వాళ్ళు దేశాన్ని నడుప్పొచ్చు. కానీ మన రాష్ట్రాన్ని నడిపే ముఖ్యమంత్రి దేశాన్ని నడుపరాదు అంట!.

👉బిజెపి సోదరులు లక్ష్మణ్ మాట్లాడుతూ బి అర్ ఎస్ అట్టర్ ప్లాప్ అంటున్నారు. మహారాష్ట్ర లోని కొన్ని మండలాల ప్రజలు తెలంగాణలో కలుపుకోవాలి అని అంటున్నారు. లచ్చన్నకు గెలుపు గర్వం వద్దు అని అంటున్న అని కేటీఆర్‌ ప్రసంగించారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు