నా కొడుకు అడిగినా సీటు ఇవ్వలేదు.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

5 Dec, 2022 13:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మల్లారెడ్డి సంస్థల అధినేత, తెలంగాణ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో కొన్ని సాధించాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలంటూ విద్యార్థులను ఉద్దేశించి హితబోధ చేశారు. 

ఐడీ రైడ్‌ చేశారు. నేను భయపడలేదు. నాలుగు వందల మంది వచ్చారు. వాళ్ల పని వాళ్లు చేసుకున్నారు. నేనేం క్యాసినో నడిపించడం లేదు. కాలేజీలు నడిపిస్తున్నా. అయినా కొందరు బ్లాక్‌ మెయిలర్స్‌ ఇబ్బంది పెట్టారు అని కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారాయన.

అంతేకాదు.. మెడకిల్‌ కాలేజీల్లో డొనేషన్లు లేవు. ఆన్‌లైన్‌ అడ్మిషన్లే. నా కొడుకు సీటు  కావాలన్న నేను ఇవ్వలేదు. భూమి అమ్మి కొడుకును ఎంబీబీఎస్‌ చేయించా. కొన్ని సాధించాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలి. ప్రేమ దోమ పక్కనపెట్టి కష్టపడి చదవాలి. ప్రేమ, ఫ్రెండ్‌షిప్‌ అన్నింటికీ దూరంగా ఉంటేనే సక్సెస్‌ అంటూ హితబోధ చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారాయి.

సక్సెస్‌ కోసం కష్టపడితే.. లైఫ్‌ పార్ట్‌నర్‌లు వాళ్లే వెతుక్కుంటూ వస్తారని విద్యార్థులకు మల్లారెడ్డి తెలిపారు. కల కన్నాను దాన్ని నిజం చేసుకున్నాను నా అంత అదృష్టవంతుడు ఎవడు లేడని మల్లారెడ్డి అన్నారు. ఆపై..  తన కొడుకుని తమ కులం అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేస్తే.. పార్టీలు, పిక్నిక్‌లు అంటూ తిరిగేది. అలా కాలేదు కాబట్టే ఇవాళ తన కోడలు నా మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌కు ఎండీ అయ్యింది. మీరు కూడా అలా కష్టపడి చదివితేనే పైకి వస్తారు అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు