ఢిల్లీ కేంద్రంగా బీసీలు ఉద్యమించాలి

30 Jul, 2022 04:42 IST|Sakshi
ఓబీసీ మహాసభ బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా బీసీలంతా ఐకమత్యం సాధించాలని, బీసీల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఇందు కోసం ఢిల్లీ కేంద్రంగా తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలని, ఆగస్టు 7న ఢిల్లీలో తలపెట్టిన ‘ఓబీసీ జాతీయ మహాసభ’లో బీసీలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మొదటి సారి ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఆగస్టు 7న ఢిల్లీలో తలకోటోర్‌ స్టేడియంలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ బ్రోచర్‌ను శుక్రవారం మంత్రుల నివాసంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వచ్చిన మండల్‌ కమిషన్‌ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా బీసీ గణన, ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ, చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంపు డిమాండ్లపై బీసీలంతా ఐక్యంగా పోరాడాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు