రాజ్యాంగ పరిరక్షణలోనే మహిళా సాధికారత 

23 Feb, 2022 02:19 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సీతక్క    

రాజ్యాంగాన్ని మార్చడమనే పదాన్నే సహించం: ఎమ్మెల్యే సీతక్క 

సుందరయ్య విజ్ఞానకేంద్రం(హైదరాబాద్‌): రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలోనే మహిళాసాధికారత ఉందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం ఇక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం– మహిళాహక్కులు, సాధికారత’అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. సీతక్క మాట్లాడుతూ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయకుండా పాలకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రతి ఒక్కరి హక్కులు, దేశ అస్తిత్వం గురించి చెప్పిన మహానీయుడని, ఆయన రాసిన రాజ్యాంగం ఈ సమాజం ఉన్నంతవరకు ఉండాలని అన్నా రు.

రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులు, ఆదేశిక సూత్రా లను పటిష్టంగా అమలు చేస్తామని చెప్పాల్సిందిపోయి ఏకంగా దానినే మార్చాలనడం బాధాకరమన్నారు. కొత్త రాజ్యాంగాన్ని రాయాలనే మాటల వెనుక కుట్ర దాగి ఉంద ని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ప్రశ్నించేహక్కు లేకుండా చేయడానికే రాజ్యాంగమార్పు అనే వాదనకు తెరతీశారని విమర్శించారు.

సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ రాజ్యాంగబద్ధ పాల న చేయడానికి సిద్ధంగా లేరని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి.సంధ్య విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ‘మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు, కేసీఆర్‌ను’అని అన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యురాలు ఇందిరాశోభన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్‌ లక్ష్మి, రచయిత్రి దాసోజు లలిత, మాలమహానాడు మహిళా అ«ధ్యక్షురాలు గీతాంజలి, మాదిగ మíహిళా సాధికారత నాయకురాలు జె.పి.లత, బీసీ మహిళానేత భాగ్యలక్ష్మి, డాక్టర్‌ జరీనా సుల్తానా, గడ్డి పద్మావతి, టీడీపీ నాయకురాలు జోత్సా్న, ఐద్వా నాయకురాలు అరుణజ్యోతి, డాక్టర్‌ రత్నమాల, ట్రాన్స్‌జెండర్‌ అసోసియేషన్‌ నాయకురాలు చంద్రముఖి, బహుజన సోషలిçస్టు పార్టీ నాయకులు టి.ప్రదీప్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు