గ్రానైట్‌ పరిశ్రమపై ఈడీ దాడులు సరికాదు..

11 Nov, 2022 00:50 IST|Sakshi

విచారణకు సిద్ధంగా ఉన్నాం: ఎంపీ రవిచంద్ర 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రానైట్‌ కంపెనీల కార్యాల యాలపై ఈడీ, ఐటీ దాడులు చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభిప్రాయపడ్డారు. తన కుటుంబ సభ్యులు, సమీప బంధువు గంగుల కుటుంబానికి సంబంధించిన గాయత్రి, శ్వేత గ్రానైట్‌ కంపెనీలపై ఈడీ, ఐటీలు దాడులకు దిగడం శోచనీయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అధికారులు చేపట్టే విచారణకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ పరిశ్రమతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని,  ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి మాత్రమే వస్తుందని, తమకు కేంద్రం నుంచి ఎటువంటి రాయితీలు రాలేదని తెలిపారు. కరోనా కారణంగా మా ర్కెట్‌ దెబ్బతిని గ్రానైట్‌ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉందని, ఈ పరిశ్రమలో జీరో వ్యాపారం అనే మాటే లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు