దళితబంధులో సామాజిక న్యాయం పాటించాలి 

26 Jul, 2022 03:06 IST|Sakshi

ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌  

మెదక్‌జోన్‌:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంలో సామాజిక న్యా యం పాటించాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మెదక్‌ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వంగపల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 22శాతం ఉన్న మాదిగలకు మొదట ప్రాధాన్యం ఇవ్వా లన్నారు.

జనాభా దామాషా ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మాదిగలు అలుపెరుగని పోరాటం చేశారని గుర్తుచేశారు. డప్పు దరువు, గూటం దెబ్బతో ఉద్యమాన్ని ఉధృతం చేసి, కేంద్రం మెడలు వంచిన ఘనత మాదిగలకు ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, జాతీయ కార్యదర్శి యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్రం పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు